Medaram | వనదేవతలకు మొక్కులు..

Medaram | వనదేవతలకు మొక్కులు..

Medaram, చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని వెంచరామి, కాల్వపల్లి గ్రామాల శివారు పూరేడు గుట్ట మినీ మేడారం జాతరలో సమ్మక్క సారక్క తల్లులు కొలువుదీరారు. దీంతో శుక్రవారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి బెల్లం, పసుపు, కుంకుమ, టెంకాయలతో మొక్కలు చెల్లించుకున్నారు. ఈ నెల 28న ప్రారంభమైన జాతర 31 శనివారం సమ్మక్క సారలమ్మ జనం నుండి వనంలోకి ప్రవేశిస్తారు.

పూరేడు మినీ మేడారం జాతరకు కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల నుండి భక్తుల రాకతో పూరేడు గుట్ట, జనసంద్రంగా మారింది. జాతరలో భక్తుల సౌకర్యార్థం మంచినీటి వసతి, వైద్య శిబిరం, కనీస వసతులు కల్పించారు. గత మూడు రోజులుగా జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిట్యాల ఎస్ఐ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply