23 people | విద్యార్థులకు అస్వస్థత

23 people | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మధ్యాహ్న భోజనం తిని 23మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, కడుపు నొప్పితో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది అప్రమత్తమై విద్యార్థులను వెంటనే నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విద్యా, వైద్యాధికారులు విచారణ ప్రారంభించారు.

