Tribal Women | ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు ప్రశాంతం…

Tribal Women | ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు ప్రశాంతం…

  • బూర్గంపాడు సీహెచ్‌సీలో సురక్షిత ప్రసవం…
  • ఇద్దరు చిన్నారులకు జన్మనిచ్చిన మడకం జోగి…

Tribal Woman | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు, ఆంధ్ర ప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులోని సామాజిక ఆరోగ్య కేంద్రం (సిహెచ్ సి) లో ప్రసవాలు ప్రశాంతం జరుగుతున్నాయి. ఉచిత కాన్పు వలన ఆరోగ్యాలకి మంచిదని వైద్యులు తెలుపుతున్నారు. బుధవారం తెల్లవారుజామున ఆస్పత్రిలో వైద్యులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక గిరిజన మహిళకు విజయవంతంగా ప్రసవం చేశారు.

వివరాల్లోకి వెళ్తే… ముల్కలపల్లి మండలం, ఉటాచెరువు గ్రామానికి చెందిన మడకం జోగి (భర్త విజయ్) బుధవారం తెల్లవారుజామున పురిటి నొప్పులు అధికం కావడంతో 108 అత్యవసరం అంబులెన్స్ కు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన అంబులెన్స్ సిబ్బంది హుటా హుటిగా అక్కడకు చేరుకున్నారు.సదరు మహిళను వెంటనే బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరిస్థితిని గమనించిన డ్యూటీ డాక్టర్ , నర్సింగ్ సిబ్బంది వెనువెంటనే స్పందించి ఆమెకు వైద్యం అందించారు. సురక్షితమైన ప్రసవం అనంతరం ఆమె ఇద్దరు చిన్నారులకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి ,ఇద్దరు బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

అత్యవసర సమయంలో మెరుగైన వైద్యం అందించి, సురక్షితంగా డెలివరీ చేసిన వైద్య బృందాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులు స్థానికులు అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందనడానికి ప్రస్తుతం జరుగుతున్న ప్రస్వాలే నిదర్శనమని పలువురు ఆసుపత్రి పని తీరుపై అభినందనలు తెలుపుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసాదం జరిగితే పేదరిక కుటుంబాలు ఆర్థిక భారం నుండి బయటపడతాయని వైద్యులు తెలుపుతున్నారు.

ప్రైవేటు ఆసుపత్రిలో డెలివరీ కోసం సుమారు 50 నుండి 60 వేల రూపాయలకు వసూలు చేసి ఆపరేషన్ నిర్వహిస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి ఒక్క రూపాయి లేకుండా అనుభవం కలిగిన డాక్టర్ల చేత కాన్పులు ఉచితంగా జరపటమే కాకుండా అవసరమైతే ఆపరేషన్ సైతం నిర్వహించి తల్లి బిడ్డలు క్షేమం కోసంగా ఉండేందుకు వైద్యం అందిస్తారని వైద్య బృందం పేర్కొంటుంది. మండల కేంద్రంలో ఉన్నటువంటి సామాజిక ఆసుపత్రి లో డాక్టర్లు అన్నీ వేళలో అందుబాటులో ఉంటున్నారని ప్రతి ఒక్కరు గర్భిణీ స్త్రీలు తమని సంప్రదించాలని వారు కోరుకుంటున్నారు.

Leave a Reply