AP | శ్రీ భావనఋషి దేవాలయ నిర్మాణానికి విరాళం…

AP | శ్రీ భావనఋషి దేవాలయ నిర్మాణానికి విరాళం…

AP | ఘంటసాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన ఘంటసాల పరిధిలో గల గోటకం -ఏ, బి, జ్ఞానోదయ కాలనీలు శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనఋషి దేవాలయ నిర్మాణానికి గొర్రెపాటి ఫౌండేషన్ చైర్మన్, ప్రవాస భారతీయుడు గొర్రెపాటి రంగనాథ బాబు రూ.50వేలు, జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ రూ.10వేలతో కలసి రూ.60 వేలు ఆలయ కమిటీ సభ్యులైన తుమ్మలచర్ల మురళీకృష్ణ, ఆకురాతి సుబ్రమణ్యం, పడవల బాబురావులకు ఆలయ ఆవరణలో గొర్రెపాటి వెంకట రామకృష్ణ అందజేశారు. వెంకట రామకృష్ణ మాట్లాడుతూ గొర్రెపాటి ఫౌండేషన్ చైర్మన్, గొర్రెపాటి రంగనాథబాబు అమెరికా వెళుతూ అనివార్య కారణాల చేత రాలేక, నా చేతికిచ్చి కమిటీ వారికి అందజేయమని తెలుపగా, నేను వారికి అందజేసినట్లు ఆయన తెలిపారు. కమిటీ మెంబర్స్ మునగాల దొరబాబు, గుత్తికొండ శ్రీనివాసరావు, బొడ్డు శేషు, నల్లమూలు నాగేశ్వరరావు, పోలన రమణయ్య, తుమ్మలచర్ల దుర్గాప్రసాద్, తదితర గ్రామస్తులు పాల్గొని దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply