Devotees | మరుగుదొడ్ల నిర్మాణ పనులు…

Devotees | మరుగుదొడ్ల నిర్మాణ పనులు…
- జంపన్న వాగు సమీపంలో కూలిపోతున్న మరుగుదొడ్లు ..
Devotees | మేడారం, నల్లబెల్లి, ఆంధ్రప్రభ : మేడారం మహా జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల నిర్మాణ పనులు నాణ్యత లోపంతో చేపట్టడంతో జాతర ముగియకముందే కూలిపోతున్న సంఘటన నెలకొంది. సమ్మక్క-సారలమ్మ జాతర అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను మంజూరుచేయగా… సదరు కాంట్రాక్టుదారులు కక్కుర్తి పడి నాణ్యతా లోపంతో నిర్మాణ పనులు చేపట్టడం వలన పట్టుమని పది రోజులు గడవకముందే మరుగుదొడ్లు కూలిపోతున్నాయి.

కాంట్రాక్టుదారుల నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపం మహా జాతరకు వచ్చే భక్తులకు శాపంగా మారింది. మహాజాతరలో పనులు నాణ్యతగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ సంబంధిత ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం వలన కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేపట్టారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి మేడారం జాతరలోని జంపన్న వాగు సమీపంలో తలనీనాలు సమర్పించే షెడ్డు పక్కన గల మరుగుదొడ్లు కూలిపోతున్న విషయాన్ని గుర్తించి సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
