Electricity | మేడారం జాతరకు విద్యుత్ శాఖ సర్వం సిద్ధం

Electricity | మేడారం జాతరకు విద్యుత్ శాఖ సర్వం సిద్ధం

  • ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, ఐఏఎస్
  • నాలుగు వేర్వేరు మార్గాల నుండి ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఏర్పాట్లు.
  • క్షేత్రస్థాయిలో విద్యుత్ పనుల పర్యవేక్షణ, ప్రతి ట్రాన్స్‌ఫార్మర్ వద్ద లోడ్ పరిశీలన
  • రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీతో 106 ట్రాన్స్‌ఫార్మర్ల పర్యవేక్షణ
  • సిబ్బందికి ఎన్పీడీసీఎల్ లోగో టి-షర్టుల పంపిణీ

Electricity | తాడ్వాయి, ఆంధ్రప్రభ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, ఐఏఎస్ స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన విద్యుత్ అధికారులతో మేడారంలో పర్యటించి విద్యుత్ సరఫరా తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 132 కెవి కమలాపూర్, పస్రా, ములుగు నుండి వచ్చే 33 కెవి నాలుగు వేర్వేరు మార్గాల నుండి ప్రత్యామ్నాయ సరఫరా కోసం డి.పి. స్ట్రక్చర్‌తో కూడిన 8 పోల్ వ్యవస్థను పర్యవేక్షించారు.

106 ట్రాన్స్‌ఫార్మర్లను నేరుగా సబ్ స్టేషన్ నుండి మానిటర్ చేసేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థను ఏర్పాటు చేశామని, దీని ద్వారా సమస్యను తక్షణమే గుర్తించి సరిచేయవచ్చని తెలిపారు. జాతర విధుల్లో ఉండే సిబ్బంది కోసం 55 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరికి ఏడీఈ, ఏఈ స్థాయి అధికారులు పర్యవేక్షకులుగా ఉంటారు. సమ్మక్క సబ్ స్టేషన్ వద్ద సిబ్బందికి ఎన్పీడీసీఎల్ లోగోతో కూడిన టి-షర్టులను సీఎండీ పంపిణీ చేశారు.

నిరంతర విద్యుత్ సరఫరాను ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి 600 మంది సిబ్బందిని జాతర కొరకు నియమించడం జరిగిందని చెప్పారు. వీరందరికి అన్ని వసతులు ఏర్పాటు చేశామని 70 టెంట్లను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. తాడ్వాయి, పస్రా సబ్ స్టేషన్లను సందర్శించిన సీఎండీ కొత్తగా నిర్మిస్తున్న సెక్షన్ ఆఫీస్, గట్టమ్మ వద్ద సబ్ స్టేషన్ పనులను వేగవంతం చేయాలని ఏజెన్సీలను ఆదేశించారు. జాతరను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సిబ్బందిని కోరారు.

ఈ కార్యక్రమంలో, డైరెక్టర్లు వి. మోహన్ రావు టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్ కె. రాజు చౌహన్, సీఈ ఐటి శ్రవణ్ కుమార్, జియం ఐటి శ్రీనివాస్, ములుగు ఎస్ఈ ఆనందం, భూపాలపల్లి ఎస్ ఈ మల్చూరు, డిఈ ములుగు పి. నాగేశ్వర రావు, డి.ఈ. కంస్ట్రక్షన్ సదానందం, డ్.ఈ టెక్నికల్ భాస్కర్, ఈ ఈ సివిల్ వెంకట్ రామ్, ఏడీఈ లు : రాజేష్, వేణుగోపాల్, సందీప్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply