Adilabad | నూతన ఎస్ ఐ, ఏఎస్ ఐలకు సన్మానం…

Adilabad | నూతన ఎస్ ఐ, ఏఎస్ ఐలకు సన్మానం…
Adilabad | ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పోలీస్ స్టేషన్ కు నూతనంగా ఎస్సైగా వచ్చిన విజయ్ నూతన ఏఎస్ఐ రాథోడ్ ధార సింగ్ లను లంబాడ ఉమ్మడి జిల్లా జేఏసీ నాయకులు వారిని ఈ రోజు సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన ఎస్ఐ, ఏ ఎస్ఐలకు శాలువాతో శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపినట్లు లంబాడ జేఏసి నాయకులు పేర్కొన్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో పేద గిరిజన, గిరిజనేతర ప్రజలు, ఇతరులు జీవిస్తున్నారని, వారి స్థితిగతులు అర్థం చేసుకొని ,శాంతి భద్రతలను కాపాడుతూ, అందరికీ న్యాయం జరిగే విధంగా సహకరించాలని కోరినట్లు వారు తెలిపారు.ఈ సందర్భంగా వారు సానుకూలంగా స్పందిస్తూ, చట్టాల పరిధిలో అందరికీ తగు న్యాయం జరిగే విధంగా సహకరిస్తామని వారు పేర్కొనడం జరిగిందని వారు తెలిపారు.

ఈ సన్మాన0 చేసిన వారిలో లంబాడి జేఏసీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి న్యాయవాదిబానోత్ జగన్ నాయక్, భానోత్ రామారావు, ఉపాధ్యక్షులు రాథోడ్ శేష రావు, నేతావత్ రాందాస్ నాయక్, కార్యదర్శి పవర్ విజయకుమార్, కోశాధికారి జాదవ్ రాజేష్ పాల్గొన్నట్లు వారు తెలిపారు.
