Nalgonda | వైద్యం వికటించి మహిళ మృతి

Nalgonda | వైద్యం వికటించి మహిళ మృతి

Nalgonda | నల్గొండ, ఆంధ్ర ప్రభ : వైద్యుల నిర్లక్ష్యంతో మహిళా మృతి చెందిన సంఘటన నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న తులసి హాస్పిటల్ లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం నేరేడు గోమ్మ మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన పులికంటి రమణ(42) అనారోగ్యంతో నల్గొండ పట్టణంలోని తులసి హాస్పిటల్ కు ఈనెల 18న వైద్య సేవల కోసం రావడం జరిగిందని బంధువులు తెలిపారు. ఆమెను వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు గర్భసంచికి పుండు అయిందని నిర్ధారణ చేసి తొమ్మిది రోజుల నుండి ఆమెకు వైద్య సేవలు నిర్వహించారు. చిన్న సమస్యతో ఆస్పత్రికి వచ్చిన ఆమె సోమవారం రాత్రి వైద్యం వికటించి మృతి చెందినట్లు 42 బంధువులు ఆరోపించారు. ఆమె మృతి చెందడంతో బంధువులు హాస్పిటల్ ముందు మంగళవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఆమెకు గర్భసంచి ఆపరేషన్ చేసే క్రమంలో వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో మృతి చెందినట్లు ఆరోపించారు. మృతురాలికి భర్త ఇతరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు.

Leave a Reply