SR University | జోష్ నింపిన సింగర్ శ్రీరామచంద్ర..

SR University | జోష్ నింపిన సింగర్ శ్రీరామచంద్ర..
SR University, హసన్ పర్తి, ఆంధ్రఫ్రభ : ఎస్‌ఆర్ యూనివర్సిటీ వార్షిక సాంస్కృతిక వేడుకలు స్పార్క్‌రిల్ 2026 మూడో రోజు నిర్వహించిన ప్రో నైట్ కార్యక్రమం ఆనందోత్సవాలతో అట్టహాసంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకలు విద్యార్థుల సృజనాత్మకత, ఉత్సాహం సాంస్కృతిక వైభవాన్ని అద్భుతంగా ప్రతిబింబించాయి. ఈ సందర్బంగా ఎస్‌ఆర్ యూనివర్సిటీ ఛాన్సలర్ ఏ. వరద రెడ్డి, వైస్ ఛాన్సలర్ వి. మహేష్, రిజిస్ట్రార్ పి వెంకట రమణ రావు, డీన్ – ఆపరేషన్స్ & గ్రోత్ ఆర్ అర్చనా రెడ్డిలు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ప్రో నైట్ సందర్భంగా వివిధ సాంస్కృతిక క్లబ్‌ల విద్యార్థులు ప్రదర్శించిన నృత్య, గీత, థీమ్ ఆధారిత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
విద్యార్థుల కేరింతలు, అధ్యాపకుల ఉత్సాహం కలిసి క్యాంపస్‌ను పండుగ వాతావరణంతో నింపాయి. విద్యార్థులు, సిబ్బంది అందరూ ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా ఆస్వాదించారు. ప్రఖ్యాత కొరియోగ్రాఫర్, ఇంటర్నెట్ సంచలనం పండు మాస్టర్ అందించిన ఉత్సాహభరితమైన ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. మాష్టర్ చేసిన స్టెప్పులు, నృత్యాలతో విద్యార్థుల్లో నూతనోత్సం వెల్లివిరిసింది. అనంతరం ప్రముఖ నేపథ్య గాయకుడు శ్రీరామ్ చంద్ర అందించిన మధురమైన గానప్రదర్శనతో కార్యక్రమం శిఖరానికి చేరుకుంది. ఆయన గానం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపి మరపురాని అనుభూతిని, జోష్ ను నింపింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో స్టూడెంట్ కౌన్సిల్ కన్వీనర్లు ఎల్. రిషింద్రసాయి, ఏ. సంతోషిని రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ వేడుకలకు డీన్ – స్టూడెంట్ వెల్ఫేర్ ఎవివి సుదాకర్, కె దీప అసోసియేట్ డీన్ – స్టూడెంట్ వెల్ఫేర్ కె దీపలు కన్వీనర్లుగా వ్యవహరించగా, అసోసియేట్ డీన్ లు ధూమల్ సూరజ్ నందకుమార్, పి రాధాకృష్ణన్, సహ కన్వీనర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. యూనివర్శిటీలో స్పార్క్‌రిల్ 2026 వేడుకలు విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలుగులోకి తెచ్చే వేదికగా నిలిచి, సాంస్కృతిక ఉత్సాహాన్ని నింపింది.

