Minister | మధుసూదన్ రెడ్డి మృతి తీరని లోటు…

Minister | మధుసూదన్ రెడ్డి మృతి తీరని లోటు…

  • కేంద్రమంత్రి గంగపురం కిషన్ రెడ్డి

Minister | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి మరణం బీజేపీ పార్టీకి తీరని లోటని కేంద్ర మంత్రి గంగపురం కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ వంగ మధుసూదన్ రెడ్డి నివాసానికి వచ్చి మధుసూదన్ రెడ్డి కుమారుడు సిద్ధార్థ రెడ్డి, ఆయన సతీమణి పద్మజ, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

ఆయన మరణం ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రజలకు తీరని లోటన్నారు. పార్టీ కోసం, డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఆయన అన్నారు. పరామర్శించిన వారిలో రంగారెడ్డి జిల్లా అర్బన్ జిల్లా అధ్యక్షులు వనపల్లి శ్రీనివాసరెడ్డి, మన్సురాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, కళ్లెం రవీందర్ రెడ్డి, చంపాపేట బీజేపీ అధ్యక్షులు పోరెడ్డి రవీందర్ రెడ్డి, సద్ది సందీప్ రెడ్డి, దశరథ్ గౌడ్, రాంపురం శ్రీనివాస్, చిలువేరు అనిల్ కుమార్, రమేష్ రెడ్డి, తదితరులున్నారు.

Leave a Reply