24k gold | ధరలు రికార్డు స్థాయిలో.. ఇప్పుడే కొనాలా? పెళ్లిళ్ల సీజన్ ముందు నిపుణుల కీలక విశ్లేషణ

24k gold |బంగారం ధరల పెరుగుదల: పెట్టుబడిదారులకు హెచ్చరికా? అవకాశమా?
24k gold | బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
అంతర్జాతీయ పరిణామాల ప్రభావmEmiTi?
భారత మార్కెట్లో బంగారంపై పెళ్లిళ్ల సీజన్ ప్రభావం
ఇప్పుడే బంగారం కొనడం మంచిదేనా?
భవిష్యత్తులో ధరలు తగ్గే అవకాశం ఉందా?
దీర్ఘకాలిక పెట్టుబడిగా బంగారం ఎంత సురక్షితం?
24k gold | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బంగారం….ఒక సురక్షితమైన పెట్టుబడి. పెరగడమే తప్ప తరగని విలువైన ఆస్తి. బంగారం ధర పెరుగుదలకు అనేక అంతర్జాతీయ పరిణామాలతో ముడిపడి ఉంటుంది. దేశీయ మార్కెట్ విషయానికొస్తే, ఇది భారతీయుల సెంటిమెంట్ కు, సంప్రదాయాలకు ముడిపడి ఉన్న వస్తువు కావడంతో, ఇక్కడ పెళ్ళిళ్ళు, పేరంటాలు శుభకార్యాల సీజన్ లతో హెచ్చుతగ్గులు కాస్త ఉంటాయి.
ప్రస్తుతం పుష్యమాసం అంటే శూన్యమాసం…పెళ్ళిళ్ళ సీజన్ కాదు, అయినా బంగారం ధర పరుగు ఆగడం లేదు. కాస్తో కూస్తో బంగారం కొనుక్కోవాలనుకునే భారతీయులందరి మనసుల్లో ఇప్పుడు ఒకటే భయం. బంగారం ధర ఇప్పుడే ఇలా ఉంటే, రేపు రాబోయే పెళ్ళిళ్ళ సీజన్ కి ఎలా? ప్రపంచ మార్కెట్లో, భారతదేశంలో బంగారం ధరలు 2026 లో రికార్డు స్థాయిలను దాటేస్తున్నాయి.

అంతర్జాతీయంగా బంగారం ధరలు $5,000 ఒన్స్ను దాటినట్లు కూడా నమోదు అయిందని ఆర్థిక నివేదికలు సూచిస్తున్నాయి. వీటి ప్రకారం భారత మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర కూడా అంచనాలను మించి పెరిగుతూ, 10 గ్రాములకు ₹1.5 లక్షలకు పైగా ఉంది. ప్రస్తుతం బంగారం ధరలు పెరుగుతూనే ఉన్న నేపధ్యంలో, నిరంతర పెరుగుదల మంది పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది, ఎందుకంటే బంగారం సురక్షిత పెట్టుబడి అని విశ్లేషకుల అభిప్రాయం. బంగారం ధరలు ఇంతవరకు ఒక ఎత్తుకి చేరడం వెనుక కొన్ని అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
అంతర్జాతీయ అనిశ్చితి అంటే, ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు, అగ్ర దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, ఉద్రిక్తతలు, వివిధ పన్నుల విధానాలు వంటి అనేక కారణాల దృష్ట్యా పెట్టుబడిదారులు సేఫ్ హేవెన్ గా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. ప్రపంచ దేశాలు తమ అంచనా సరిపోయేలా డాలర్‌పై ఆధారపడడాన్ని తగ్గించి బంగారం నిల్వలను పెంచుతున్నాయి. డాలర్ బలహీనత ఇంకా రూపాయి విలువ మార్పు, కారణంగా భారతదేశంలో బంగారం దిగుమతుల ధరలు ఎక్కువగా ఉన్నాయి.
పెళ్లిళ్ల సీజన్ వరకు ధరలు కొంత నిలకడగా ఉండే అవకాశం ఉంది.కానీ కొంత ఉత్పాదన, సరఫరా వ్యత్యాసాలు లేదా స్వల్ప మార్కెట్ మార్పులను బట్టి ఈ హెచ్చుతగ్గులు ఉండొచ్చు.ప్రస్తుతం ఉన్న రికార్డు స్థాయి ధరలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు సూచించే అంశాలు: ఇలాంటి సందర్భాల్లో కొంత మంది పెట్టుబడిదారులు వడ్డీ రేట్ల పరిణామాలను, డాలర్ ట్రెండ్‌ని గమనిస్తూ సీజన్ ముందు కొంత బంగారం కొనుగోలు చేస్తున్నారు. వీరి అంచనాలు ఎక్కువగా ధరలు ఇంకా మరికాస్త పెరుగుతాయనే దానిపైనే ఆధారపడి ఉన్నాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పెళ్ళిళ్ళ సీజన్ దాకా ఆగకుండా ఇప్పుడే బంగారం కొనకపోవడం మంచిదా అంటే, ఇది పూర్తిగా ఎవరెవరి వ్యక్తిగత ఆర్థిక అవస్రాలు, వారి వారి లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి, పండుగ/సీజన్ మధ్యలో ధరలు సాధారణంగా పెరుగుతుంటాయి, ఒకేసారి ఎవరికైనా సొమ్ము కూడబెట్టడం కష్టమైనది కనుక ఎవరైనా, ఎప్పుడైనా కొంటూండవచ్చు.

దీర్ఘకాలిక పెట్టుబడి కోసమే బంగారం కొనాలనుకుంటే, చిన్న చిన్న భాగాలుగా అంటే తక్కువ పరిణామంలో వీలువెంబడి కొనే అలవాటు చేసుకుంటే మంచిది. బంగారం ధరలు పూర్తిగా తగ్గిపోవటం అత్యంత పెద్ద అరుదుగా కనిపిస్తుంది, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం స్వల్ప మొత్తాల్లో ధరలు హెచ్చుతగ్గులు జరుగుతూండవచ్చు. పెద్దగా తగ్గడం మాత్రమే పూర్తిగా మార్కెట్ పరిణామాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అయితే, కేంద్ర బ్యాంకుల కొనుగోలు, మరియు వివిధ వర్గాల ప్రజల పెట్టుబడులు, ఆర్థిక అవసరాలు ధరలను ఒత్తిడి చేస్తూ నిలుపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒక చిన్న తగ్గుదల తాత్కాలికంగా రావచ్చు, కానీ దీర్ఘకాలంలో పూర్తిగా స్థిరమైన స్థాయికి రావటం మాత్రం అస్సలు కుదురదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు
click here to read 10grms.1.44 laksh | ఆకాశమే హద్దుగా బంగారం ధరలు
