Parade | గణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు…

Parade | గణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు…
Parade | ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ మండల కేంద్రములోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో “26 జనవరి” ని పురస్కరించుకుని “గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ వేషాధారణలతో ఉదయం 6:30 గం.లకే పాఠశాలకు చేరుకున్నారు. ఉదయం 7:00 గం.ల నుండి 8:00 గం.ల వరకు ఘోష్ వాయిద్యాలతో ముధోల్ పుర వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు.
అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమితి అధ్యక్షులు రవీంద్రనాథ్ పాండే జాతీయపతాకావిష్కరణ గావించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్బిఐ ముధోల్ బ్రాంచ్ మేనేజర్ అశోక్ చౌహాన్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల వేషధారణలు, సాంస్కృతిక నృత్యాలు, కృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.

పెద్దలు విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా పోషకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు వందేమాతరం గేయ ఆలాపనతో కార్యక్రమం ముగిసింది.ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడు ధర్మపురి సుదర్శన్, భైంసా ఆర్ & బీడిఇ వాగ్మారే సునిల్, పాఠశాల సమితి, ప్రబంధకారిణి, సలహా సమితి సభ్యులు, పోషకులు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.




