TG | ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

TG | ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
TG | లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు. పలు ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు, కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పలు పార్టీల రాజకీయ నాయకులు తమ తమ పార్టీల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. తహసీల్దార్ దిలీప్ కుమార్, ఏంపీడీఓ సరోజ, ఏ ఓ శ్రీకాంత్, ఏపీఏం భూమక్క, ఏం ఈ ఓ శైలజ, పోలీస్, జైలు, ఎక్సయిజ్, ఫారెస్ట్, వైద్య శాఖతో పాటు అన్ని శాఖల కార్యాలయ అధికారులు, ప్రెస్ క్లబ్ లో అధ్యక్షులు బోనగిరి కుమార్, పలు వ్యాపార సంఘాల నాయకులు జాతీయ జెండా ఆవిష్కరణ చేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, ప్రభుత్వ అధికారులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
