Bachannapet | ఘనంగా 77 గణతంత్ర దినోత్సవ వేడుకలు …

Bachannapet | ఘనంగా 77 గణతంత్ర దినోత్సవ వేడుకలు …
Bachannapet | బచ్చన్నపేట, ఆంధ్రప్రభ : బచ్చన్నపేట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లోనూ 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసిల్దార్ హుసేన్ జెండా ఆవిష్కరించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో మమతా బాయ్, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ ఎస్ కే హమీద్ , ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జనగామ అసిస్టెంట్ రిజిస్టార్ కోర్నియా లెస్, మండల వ్యవసాయ శాఖ కార్యాలయం రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖ అధికారి విద్యాకర్ రెడ్డి, మండల ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శ్రీనివాస్, సెంట్రల్ బ్యాంక్ లో మేనేజర్ గోపీనాయక్, ఐకెపి కార్యాలయంలో ఏపీఎం రవి , ఎంఈఓ కార్యాలయంలో వెంకట్ రెడ్డి, బచ్చన్నపేట గ్రామపంచాయతీలో సర్పంచ్ అల్వాల నర్సింగరావు, మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ గద్దె వద్ద మహాత్మ చారి, బీఆర్ఎస్ పార్టీ గద్దె వద్ద గంధ మల్ల నరేందర్, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మహేష్, సిపిఎం కార్యాలయం వద్ద బెల్లంకొండ వెంకటేష్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు వద్ద మేనేజర్ రాజు, పశు వైద్యశాల అధికారి నాగ ప్రసాద్, ఎస్సీ హాస్టల్ లో వార్డెన్ గొర్రె మహేందర్, పలు గ్రామాలలోనూ గ్రామపంచాయతీల వద్ద నూతన సర్పంచులు, పాఠశాలల వద్ద ప్రధానోపాధ్యాయులు, పలు గ్రామాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీ గద్దెల వద్ద గ్రామ శాఖ అధ్యక్షుడు, అంగన్వాడీ కేంద్రాల వద్ద అంగన్వాడీ టీచర్లు, జెండా ఆవిష్కరణలు ఘనంగా నిర్వహించారు.
