Warangal | శివనగర్‌లో స్వల్ప అగ్నిప్రమాదం

Warangal | శివనగర్‌లో స్వల్ప అగ్నిప్రమాదం
- ఆర్పి వేసిన అగ్నిమాపక సిబ్బంది
Warangal | కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలోని 35వ డివిజన్ శివనగర్లో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శివనగర్ మసీద్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో పిచ్చి మొక్కలు చెత్తాచెదారం ఉంది. ఖాళీ ప్రదేశంలోని చెత్త నుండి పొగ వస్తూ క్రమేన చెత్తాచెదారం అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పి వేశారు. ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది డివిజన్ వాసులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు చెత్తాచెదారం ఉన్న ఖాళీ ప్రదేశాలలో సిగరెట్ ముక్క వేయరాదని అనుకోకుండా చెత్తాచెదారం అంటుకొని అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అని సూచించారు.
