MLA | క్యాంపు ఆఫీసులో గణతంత్ర వేడుకలు..

MLA | హనుమకొండ, ఆంధ్రప్రభ : భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండ బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ… గణతంత్ర దినోత్సవం దేశ ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గుర్తించి, దేశ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని కుటుంబ సభ్యులు, 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply