Survey | ఏపీలో ఫిబ్రవరి 10వరకు సర్వే

Survey | ఏపీలో ఫిబ్రవరి 10వరకు సర్వే
- ఏకీకృత కుటుంబ సమగ్ర సర్వే గడువును పొడిగించిన సర్కార్
Survey | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌లో సర్వే మొదలవ్వగా.. 30 రోజుల పాటు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 12 వరకు ఈ సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ముగిసినా సర్వే ఇంకా పూర్తి కాలేదు. టెక్నికల్ కారణాల వల్ల సర్వే ఆలస్యమవుతోంది. దీంతో గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సర్వే ద్వారా ఏపీలోని ప్రతీ కుటుంబం వివరాలు నమోదు చేయనున్నారు. ఆన్‌లైన్ విధానంలో ఈ సర్వే చేపడుతుండగా.. గ్రామాల్లో ఫోన్ సిగ్నల్స్ ఉండకపోవడం, ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉండటం వల్ల వివరాలు నమోదు చేయడంలో జాప్యం జరుగుతోంది. దీంతో సర్వేలో వివరాలు నమోదు చేయడం కష్టమవుతుందని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ సమగ్ర కుటుంబ సర్వేలో ఇంటింటికి వెళ్లి 20 రకాల అంశాలపై సమాచారం సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
