TG | మాజీ మార్కెట్ చైర్మన్ మాణిక్యంను ప‌రామ‌ర్శ‌…

TG | మాజీ మార్కెట్ చైర్మన్ మాణిక్యంను ప‌రామ‌ర్శ‌…

TG | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బడుగు మాణిక్యం ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో విషయం తెలుసుకున్న రాజీవ్ ద్వారక ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రావుల మాధవరెడ్డి సోమవారం చౌటుప్పల్ లోని మాణిక్యం ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నదని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ స్మారక ట్రస్టు సభ్యులు ఎంఏ ఖయ్యూం, నల్ల నరసింహ, ఆవుల యేసు యాదవ్, మొగుదాల రమేష్ గౌడ్, ఊదరి యాదయ్య, మలిగె మల్లేశం, మాదాని గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply