TG | తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ

TG | తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ

TG | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సైనికుల గౌరవ వందనం స్వీకరించారు.

తెలుగులో ప్రసంగం మొదలుపెట్టారు… రాజ్యాంగం మనకు స్వేచ్ఛ, సమానత్వం ప్రసాదించింది. భిన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకత. ప్రజాప్రభుత్వం రైజింగ్‌ తెలంగాణ-2047లో సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది. హైదరాబాద్‌ ఇమేజ్‌ పెంచేలా తెలంగాణ రైజింగ్‌ డాక్యుమెంట్‌ ఉందని గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ పేర్కొన్నారు.

అలాగే తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలిలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్ర సచివాలయంతో పాటు జిల్లా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లోనూ రిపబ్లిక్ డే వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.

Leave a Reply