Parade Ground | ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

Parade Ground | ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

Parade Ground | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్ర ప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఉదయం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వేడుకల్లో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, స్థానిక శాసనసభ్యులు కూచికుళ్ళ డాక్టర్ రాజేష్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం పాల్గొన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ప్రసంగిస్తూ.. నాగర్‌కర్నూల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందంజలో ఉందని, ఈ అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలంటే అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయం, సహకారం ఎంతో అవసరమని అన్నారు. గత ఒక సంవత్సర కాలంలో జిల్లా వ్యాప్తంగా అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను కలెక్టర్ వివరించారు. జిల్లాను అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లి అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు అంకితభావంతో పని చేయాలని కోరారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దేశభక్తిని ప్రతిబింబించే నృత్యాలు, గీతాలు ప్రేక్షకులను ఉత్సాహపరిచాయి.

Leave a Reply