Andhra Pradesh | ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

Andhra Pradesh | ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

ఏలూరు బ్యూరో, ఆంధ్ర ప్రభ : 77 వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు ఐజి జి.వి.జి. అశోక్ కుమార్, ఏలూరు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా ఐజి మాట్లాడుతూ.. 1950లో ఇదే తేదీన రాజ్యాంగాన్ని అధికారికంగా స్వీకరించి అమలు చేసినందుకు గుర్తుగా, భారతదేశ సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యాన్ని స్థాపించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని ఏటా జరుపుకుంటారు అని, గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత, రాజ్యాంగ విలువలు, దేశ సేవలో పోలీసుల పాత్ర గురించి సిబ్బందికి వివరించారు.

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జెండా వందనం చేసారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26,1950 నుండి దేశం పరిపాలన పరంగా పూర్తిగా ప్రజా స్వామ్యంగా మారింది. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ పునాదులను స్మరించుకుంటాం అన్నారు. ప్రజలకు ఇప్పటి వరకు చేస్తున్న సేవలకు కంటే భవిష్యత్తులో మెరుగైన సేవలు అందిస్తారని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలియచేశారు.

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన ఎన్. సూర్య చంద్రరావు జెండా వందనం చేసి సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఆర్ ప్రధాన కార్యాలయం లో ఏఆర్ అదనపు ఎస్పీ జి.ముని రాజా ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ బీఎస్పీ చంద్రశేఖర్, ఎస్.బి ఇన్స్పెక్టర్ మల్లేశ్వర రావు, ఆర్‌ఐ లు పవన్ కుమార్, సతీష్, ఆర్ఎస్ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొని గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపు కున్నారు.

Leave a Reply