Madaram | వనదేవతల ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధి…

Madaram | వనదేవతల ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధి…

– పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Madaram | తొర్రూరు, ఆంధ్రప్రభ : వనదేవతల ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరిగే మేడారం జాతరలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిలు పాల్గొన్నారు.

సమ్మక్క, సారలమ్మల గద్దెలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. కుంభమేళాను తలపించే మేడారం జాతర తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైనదని, ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ రూ.251 కోట్లను మంజూరు చేసిందన్నారు. ఈనెల 28 నుంచి 31 వరకు జరిగే మేడారం జాతరకు గతంలో కన్న రెట్టింపు సంఖ్యలో అంటే మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని తెలిపారు.

దీనికై ఆర్టీసీ సంస్థ 3500 బస్సులను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిందన్నారు…

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందన్నారు. అమ్మవార్ల దీవెనలతో రాష్ట్రం, పాలకుర్తి నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

Leave a Reply