Doctor Award | బొడ్డు గంగన్నకు డాక్టర్ అవార్డు…

Doctor Award | బొడ్డు గంగన్నకు డాక్టర్ అవార్డు…
Doctor Award | కడెం (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : గత 15 సంవత్సరాలుగా నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాసేవలో తనదైన ముద్ర వేసిన కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బొడ్డు గంగన్నని డాక్టరేట్ అవార్డు వరించింది. 2012 సంవత్సరంలో “స్పందన” స్వచ్ఛంద సంస్థను స్థాపించి ట్రైబల్ ఏరియాలలో ఆరోగ్యం, విద్య, పరిసరాల పరిశుభ్రత, ఓటు హక్కు అవగాహన వంటి అంశాలపై అనేక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా సమయంలో ప్రజల ఆరోగ్య రక్షణకు తోడ్పడుతూ ఉచితంగా 10, వేల మాస్కులు పంపిణీ చేశారు.
అంతేకాకుండా నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో సర్పంచ్‌గా ఎన్నికైన అనంతరం గ్రామాభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ప్రభుత్వము స్వచ్ సర్వేక్షణ్ గ్రామీణ్ – 2023 రాష్ట్ర అవార్డును ప్రదానం చేసింది. గత 5 సంవత్సరాలుగా నచ్చన్ ఎల్లాపూర్, కడం మండల కేంద్రాలలో వేసవికాలంలో ప్రజల కోసం ఉచిత అంబలి పంపిణీ, చలివేంద్ర కేంద్రాల ఏర్పాటు వంటి కార్యక్రమాలను ప్రతి ఏడాది సొంతంగా నిర్వహిస్తూ సుమారు 5 లక్షల రూపాయల వ్యయం చేస్తున్నారు.
ఆయన సేవలను గుర్తించి ఒకే కుటుంబం నుంచి వరుసగా మూడుసార్లు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికవడం విశేషం. అలాగే ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సహాయం ట్రైబల్స్‌కు దుప్పట్ల పంపిణీ, విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ, గురుకుల ప్రవేశాలకు కోచింగ్ మెటీరియల్ అందజేయడం వంటి అనేక సేవా కార్యక్రమాలను ఆయన చేపట్టారు.
ఈ సేవలను గుర్తించి అమెరికన్ విష్డోమ్ పీస్ యూనివర్సిటీ అమెరికా విజోడం పీస్ యూనివర్సిటీ వారు పండిచ్చేరీలో బొడ్డు గంగన్న Save డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్, పొలిటికల్ ఆఫ్ సొసైటీ అవార్డును ప్రదానం చేసి ఘనంగా గౌరవించారు. ఈ సందర్భంగా కడెం మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు ఉద్యోగులు నాయకులు గ్రామస్తులు బొడ్డు గంగన్నను అభినందించారు.
