Chittoor | ఓటు హక్కు విలువను గుర్తించాలి

Chittoor | ఓటు హక్కు విలువను గుర్తించాలి

  • జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్

Chittoor | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహం నుంచి నాగయ్య కళాక్షేత్రం వరకు జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్ ఈ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో భాగంగా విద్యార్థులు మానవ హారం ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని అన్నారు. ఓటు హక్కుకు ఉన్న ప్రాధాన్యతను ప్రతి ఓటరు తెలుసుకొని తమ అమూల్యమైన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘మై ఇండియా – మై ఓటు’’ అనే నినాదంతో గాంధీ విగ్రహం నుంచి నాగయ్య కళాక్షేత్రం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమం ద్వారా ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసులు, చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మీ, డీఈఓ రాజేంద్రప్రసాద్, పీఓ ఎస్సీఎస్ఎ వెంకటరమణ, అర్బన్ ఎంఆర్‌ఓ కులశేఖర్, రూరల్ ఎంఆర్‌ఓ కళ్యాణి, సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, కాంగ్రెస్ నాయకులు పరదేశి పాల్గొన్నారు. వీరితో పాటు బిఎల్ఓలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave a Reply