Utnoor | బీటీ రోడ్డు నిర్మించాలని ఎమ్మెల్యేకు విన‌తి….

Utnoor | బీటీ రోడ్డు నిర్మించాలని ఎమ్మెల్యేకు విన‌తి….

Utnoor | ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బుజ్జు పటేల్ కు జన్నారం మండలం రూప్ నాయక్ తాండకు చెందిన సంఘ నాయకులు, గ్రామస్తులుమర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు జన్నారం మండలం రేండ్లగూడ నుండి రూప్ నాయక్ తండ మీదుగా కలమడుగు వరకు అప్రోచ్ బీటీ రోడ్డును నిర్మించాలని వినతిపత్రం సమర్పించారు. రూప్ నాయక్ తాండకు ఇప్పటివరకు తారు రోడ్డు, బీటీ రోడ్డు లేదని తమ గ్రామంలో 50 కుటుంబాలు నాయక్ పోడు గిరిజనుల కుటుంబాలు ఉన్నాయని 100 లంబాడ గిరిజనుల కుటుంబాలు ఉన్నాయని తరతరాలుగా రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యేకు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నట్లు వారు తెలిపారు. రోడ్డు విషయంలో ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకు వినతిపత్రం ఇచ్చినఎవరుపట్టించుకోలేదని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కు కృతజ్ఞతలు తెలిపినట్లు ఆ గ్రామ నాయకులు గ్రామస్తులు తెలిపారు.

Leave a Reply