Chityala | మన ఊరు- మన పరిశుభ్రత…

Chityala | మన ఊరు- మన పరిశుభ్రత…
- చుట్టిన గ్రామపంచాయతీ పాలకవర్గం
Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ : మన చుట్టుపక్కల ప్రదేశాలు పరిశుభ్రతగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో మన ఊరు – మన పరిశుభ్రత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ తెలిపారు. ఈ రోజు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం పరిధి చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామపంచాయితీ ప్రక్కన ఉన్న గ్రౌండ్ పరిశుభ్రం చేయడం జరిగింది. 8 వార్డ్ జ్వాలా యుత కమ్యూనిటీ హల్ వద్ద, మెయిన్ రోడ్, బడి ప్రాంగణంలో గుడి ముందు భాగంలో అలాగే గ్రామ సెంటర్లో పాలక వర్గం అద్వర్యంలో మన ఊరు మన శుభ్రత కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ… చిన్నకపర్తి గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయితీగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా అందరూ పని చేయాలనీ, గ్రామ ప్రజలు కూడా సహకరించాలని, ప్లాస్టిక్ ని నిషేదించాలని, బహిరంగ ప్రదేశాలల్లో చెత్త వేయడం కానీ, మాల మూత్ర విషర్జన చేయడం కానీ, మద్యం సేవించడం కానీ నిషేధం అని వివరించారు. ఈ నిబంధనలు పాటించని వారికి గ్రామ పంచాయితీ నుండి తగిన చెర్యలు తీసుకోవడం, జరిమానా విధిచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బెల్లకొండ లావణ్య రఘు, వార్డ్ మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.
