Vijay Rashmika | విజయ్ దేవరకొండ, రష్మిక హ్యాట్రిక్ మూవీ

Vijay Rashmika | విజయ్ దేవరకొండ, రష్మిక హ్యాట్రిక్ మూవీ
- రేపు మూవీ టైటిల్ అఫీషియల్‌గా అనౌన్స్మెంట్
Vijay Rashmika | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్స్స చిత్రాలతో విజయ్, రష్మిక సిల్వర్ స్క్రీన్‌పై బెస్ట్ ఫెయిర్ అనిపించుకున్నారు. వీరిద్దరూ మరో మూవీ చేస్తున్నారు. ‘టాక్సీవాలా’ ఫేం రాహుల్ సంకృత్యాన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా… సోమవారం ఈ మూవీ టైటిల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు. ప్రస్తుతం ‘VD14’ వర్కింగ్ టైటిల్‌తో మూవీ తెరకెక్కుతుండగా… సినిమాకు ‘రణబలి’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన విజయ్ ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. పవర్ ఫుల్ లుక్‌లో డిఫరెంట్ పీరియాడికల్ డ్రామాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు విజయ్ రెడీ అవుతున్నారు. టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ (Release) చేయనున్నారు.
ప్రస్తుతం విజయ్ (Vijay) వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘కింగ్డమ్’లో ఆయన నటనకు మంచి మార్కులే పడినా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ‘రాజావారు రాణివారు’ ఫేం రవికిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్దన’ మూవీ కూడా చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా చేస్తున్నారు. ప్రస్తుతం రెండు మూవీస్ షూటింగ్స్ శరవేగంగా సాగుతున్నాయి.
