10 people Injured | ఇంటికి నిప్పంటించిన ప్రియురాలు

10 people Injured | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ప్రియుడిపై కోపం రావడంతో అతడి ఇంటికి ప్రియురాలు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో చోటు చేసుకుంది. ఆ సమయంలో ప్రియుడి భార్య, కుమారుడు, తల్లి ఇంట్లోనే ఉన్నారు. ఈ ఘటనలో 10మందికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై చేబ్రోలు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
