Burning alive | బంగ్లాదేశ్‌లో మరో దారుణం..

Burning alive | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు, ఆలయాల ధ్వంసం, బలవంతపు మతమార్పిడులు, హింసాత్మక ఘటనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. రాజకీయ అస్థిరత, మతపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో హిందూ సమాజం భయాందోళనకు గురవుతోంది.

తాజాగా నర్సింగ్‌డి జిల్లాలో 23 ఏళ్ల హిందూ యువకుడు చంచల్ చంద్ర భౌమిక్‌ను సజీవ దహనం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్యేనని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. నర్సింగ్‌డి పోలీస్ లైన్స్ సమీపంలోని ఒక గ్యారేజీలో చంచల్ గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. కుమిల్లా జిల్లాకు చెందిన ఇతను తన కుటుంబానికి ఏకైక ఆధారం. అయితే చంచల్ గ్యారేజీలోనే నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు బయట నుంచి షట్టర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. నిమిషాల వ్యవధిలోనే మంటలు గ్యారేజీ అంతటా వ్యాపించాయి.

Leave a Reply