Mother Tree | చెట్ల సంరక్షణపై స్టూడెంట్స్ కు అవగాహన…

Mother Tree | చెట్ల సంరక్షణపై స్టూడెంట్స్ కు అవగాహన…

Mother Tree | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : వాతావరణం పరిరక్షణలో భాగంగా చెట్ల సంరక్షణ పై అవగాహన పెంపొందించేందుకే మదర్ ట్రీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హెచ్. సతీష్ అన్నారు.

ఈ రోజు భీంగల్ డిగ్రీ కళాశాలలో కమిషనరేట్ అఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యుయేషన్ సూచనలు అనుసరించి మదర్ ట్రీ (మాతృ వృక్షం) కార్యక్రమం నిర్వహించడం జరిగింద‌న్నారు. కళాశాల ఆవరణలో కానుగ వృక్షం ఎంపిక చేసి వృక్షానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply