studied | బాలికల చదువు భవితకు వెలుగు….

studied | బాలికల చదువు భవితకు వెలుగు….
studied | ఊట్కూర్, ఆంధ్రప్రభ : బాలికల చదువు భవితకు వెలుగని బాలికలను చదివించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ప్యారా లీగల్ వాలంటీర్ హాజమ్మ అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్ల, ఊట్కూర్ ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… బాలికలు శ్రద్ధగా చదువుకొని జీవితంలో రాణించాలని ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకొని బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలన్నారు. బాల్యవివాహాలు చేస్తే చట్టరీత్యా నేరమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సుకన్య సమృద్ధి యోజన, బేటి పడావో బేటి బచావో వంటి పథకాలు వినియోగించుకోవాలన్నారు.
బాలికలు చదువుతోపాటు వివిధ రంగాల్లో రాణించాలని అన్నారు. బాలికలకు ఏవైనా సమస్యలు వస్తే 1098, పెద్ద సమస్యలు ఉంటే సఖి 181 కేంద్రానికి ఫోన్ చేయాలని ఉచిత న్యాయ సలహాల కోసం 15100 ఫోన్ చేసి వివరాలు తెలపాలన్నారు. బాల కార్మికుల చట్టాలపై అవగాహన కల్పించారు. ఆయా కార్యక్రమంలో హెచ్ఎంలు నర్సింగప్ప, తిప్పన్న, ఉపాధ్యాయ బృందం కృష్ణ, రాజశ్రీ, అశోక్, వాలంటీర్లు నారాయణ, లక్ష్మి అరుణ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
