SP | గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అరెస్ట్…

SP | గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అరెస్ట్…
SP | మచిలీపట్నం – ఆంధ్రప్రభ : ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్న గంజాయికి సంబంధించి ఈరోజు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ జిల్లా పోలీస్ పెరేడ్ మైదానం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు పూర్వాపరాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ వివి నాయుడు, అడిషనల్ ఎస్పి ఏ ఆర్ బి.సత్యనారాయణ, గన్నవరం డిఎస్పి సిహెచ్ శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు గంజాయి, మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల వంటి వానవాళ్లు జిల్లాలో కనబడకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. కృష్ణా జిల్లా పోలీసులు అందులో భాగంగా ఎక్కడికక్కడ వాహన తనిఖీలు నిర్వహిస్తూ, గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నారు.
హనుమాన్ జంక్షన్ CI L. రమేష్ , ఆత్కూరు SIకి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు 23-01-2026 తేదిన సుమారు రాత్రి 09.00 గంటలకు చిన్నవుటపల్లి, మధుఖాన్ కటింగ్ దగ్గరలో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు AP39UP 4715 Eicher వ్యాన్ ను చిన్నవుటపల్లి, మధుఖాన్ కటింగ్ సమీపానికి వచ్చుసరికి పోలీస్ వారిని చూసి వ్యాన్ ను మధుఖాన్ ఇండస్ట్రీస్ రోడ్ వైపుకి త్రిప్పుకుని పారిపోతూ ఉండడాన్నివాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఐ, సిబ్బంది గమనించారు.

SI తన సిబ్బంది సహాయంతో ఇద్దరినీ పిన్నమనేని హాస్పిటల్ వెనుక వైపు, ఆదిత్య వెంచర్స్, గంగనమ్మ గుడి దగ్గరలో పట్టుకొని తనిఖీ చేసి వారివద్ద నుండి సుమారు 171.2 Kgs గంజాయిని, రెండు సెల్ ఫోన్ లు, Eicher వ్యాన్ ను స్వాధీనం చేసుకున్నారు. గాజువాక విశాఖపట్నానికి చెందిన హనుమంతు దుర్గా ప్రసాద్, కోలార్ నగరం జిల్లా కర్ణాటకకు చెందిన సమ్యద్ ముబారక్లను పట్టుకున్నారు.
సదరు వాహనంలో తరలిస్తున్న గంజాయిని అనకాపల్లి నుండి ఒక వ్యక్తి వాహనంతో సహా, వీరిద్దరకి ఇచ్చి కర్ణాటక రాష్ట్రంలో ఒక వ్యక్తి కి ఇవ్వండి, మీరు ఎక్కడ సరుకు అందజేయాలో తను ఫోన్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉంటాడని చెప్పగా, ఆ విధంగా ముద్దాయిలు గంజాయి ఉన్న వాహనాన్ని తీసుకొని వస్తుండగా ఆత్కూరు పోలీసులుఆ ఇద్దరు ముద్దాయిలను గంజాయితో సహా అరెస్టు చేశారు.
గంజాయి, మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల వంటివి యువత జీవితాలను నిర్వీర్యం చేయడమే కాక వారికి అందవలసిన బంగారు భవిష్యత్తును అందకుండా చేస్తుంది. కావున ఎవరికైన గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు వంటి వాటికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే సమీప పోలీస్ వారికి, ఈగల్ టీంకు సమాచారం అందిస్తే అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని, ఇప్పుడు అదుపులోనికి తీసుకున్న ముద్దాయిలను విచారించి గంజాయి కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి జిల్లాలో గంజాయి రవాణా, విక్రయలు వంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అలాగే గంజాయి రవాణాకు సంబంధించి ఫార్వర్డ్, బ్యాక్ వార్డ్ లింక్ లను కూడా పూర్తిగా వెరిఫై చేయడం జరుగుతుందని తెలిపారు.
గంజాయిను తరలించే వారిని చాకచక్యంగా పట్టుకున్న గన్నవరం డిఎస్పిని, హనుమాన్ జంక్షన్ ఇన్స్పెక్టర్ ని, ఆత్కూరు SI, వారి సిబ్బందిని, EAGLE TEAM CI M. రవీంద్ర, వారి సిబ్బందిని కృష్ణా జిల్లా SP శ్రీ. V. విద్యా సాగర్ నాయుడు IPS అభినందించారు.
