Selected | ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు..

Selected | ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు..

  • కామారెడ్డి జిల్లా నుండి ఒకే ఒక్కడు ఎంపిక

Selected | నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ నుండి కమ్మరి రాజు అనే వ్యక్తి దేశ రాజధాని ఢిల్లీలో 26వ జనవరి గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనుటకు భారత ప్రభుత్వం నుండి పిలుపు రావడంతో శనివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నందుకు గాను తెలంగాణ రాష్ట్రం నుండి 5 గురు ఎంపికయారు.

అందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి కమ్మరి రాజు ఒక్కరు కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. పూర్తిగా భారత ప్రభుత్వ ఖర్చులతో ఢిల్లీకి తీసుకుపోయి అక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తారు. అందులో భాగంగా శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు.

రాత్రి ఢిల్లీలో నే బసచేస్తారు. ఆదివారం రోజు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి అవసరమైన శిక్షణ ఇస్తారు. సోమవారం 26 నాడు జరుగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్జు పాల్గొంటారు. వేడుకల అనంతరం రాత్రి ఢిల్లీలోనే బసచేసి మంగళవారం తిరిగి ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో ఆయన ఢిల్లీ పర్యటన ముగుస్తుంది.

Leave a Reply