Street lights | పెద్ద జట్రం అభివృద్ధి చేస్తా..

Street lights | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఎంపీ డీకే అరుణ సహకారంతో పెద్దజట్రంగ్రామ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పెద్ద జట్రం సర్పంచ్ వాకిటి వెంకటేష్ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దజట్రం గ్రామంలో వివిధ వార్డులు పరిశీలించారు. పలు కాలనీలలో విధి దీపాలు లేవని ప్రజలు చెప్పడంతో వెంటనే వీది దీపాలు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకుడిగా ప్రజలు నమ్మకంతో గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేసి చూపిస్తాననిఅన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం కృషి చేస్తానని ప్రతి ఒక్కరు తనకు సహకరించాలన్నారు.
ఎంపీడీకే అరుణ, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి సహకారంతో హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం నిధులతో గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వాతి, పంచాయతీ కార్యదర్శి భవిత తదితరులు పాల్గొన్నారు.
