Nagireddypet | తాండూర్ గెట్ సమీపంలో సంచరిస్తున్న చిరుత

Nagireddypet | తాండూర్ గెట్ సమీపంలో సంచరిస్తున్న చిరుత

  • నిర్దారించిన అటవీ అధికారులు
  • ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లవద్దని రైతులకు విజ్ఞప్తి

Nagireddypet | నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గేట్ సమీపంలోని ధర్మారెడ్డి బీట్ అటవీ ప్రాంతంలో చిరుత సంచరించడం కలకలం రేపింది. ఈ రోజు ఉదయం11 గంటలకు తాండూర్ గేట్ సమీపంలోని ధర్మారెడ్డి అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారి దాటుతూ స్థానికులకు కనిపించింది. దింతో ఈ విషయాన్ని స్థానికులు నాగిరెడ్డిపేట మండల అటవీ రేంజ్ అధికారులకు సమాచారం అందించారు. అట‌వీ శాఖ రేంజ్ అధికారి వాసుదేవ్ తన రేంజ్ సిబ్బందితో కలిసి తాండూర్ గేట్ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి చిరుత ఆచూకీ పై తనిఖీ చేశారు. అక్కడ చిరుత పులి పగ్ మార్క్స్ (పాద ముద్రలు), స్కాట్స్ (విసర్జీతం) గుర్తించినట్టు ఎఫ్ ఆర్వో వాసుదేవ్ తెలిపారు.

కాబట్టి అక్కడ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరించినట్టు కచ్చితమైన‌ నిర్దారణ చేశారు. అందువల్ల అటవీ ప్రాంత సమీపంలో గల తాండూర్, ధర్మారెడ్డి, బంజార తాండ, లింగంపల్లి కలాన్ గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, రైతులు సాయంత్రం 5 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు ఒంటరిగా పొలాల వద్దకు వెళ్ళవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో రవికుమార్, బీట్ అధికారి నవీన్ బేస్ క్యాంపు గోపాల్ పాల్గొన్నారు.

Leave a Reply