Girls’ rights | బాలికల హక్కులకు భంగం కలిగిస్తే కేసులే

Girls’ rights | బాలికల హక్కులకు భంగం కలిగిస్తే కేసులే
- బాలికలకు సమాన హక్కులు
- స్వయంకృషితో ఎదగాలి
- చట్టాలపై అవగాహన పెంచుకోండి
- ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ మనీషా నెహ్ర
- హన్మకొండలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు
Girls’ rights | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : బాలికల హక్కులకు భంగం కలిగిస్తే చట్ట ప్రకారం(According to law) కేసులు నమోదు చేస్తామని ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ మనీషా నెహ్రా పేర్కొన్నారు. భారత రాజ్యాంగం బాలికలకు సైతం సమాన హక్కులు కల్పించిందని గుర్తు చేశారు. పోటీ ప్రపంచంలో బాలికలు స్వయం కృషితో పోటీ పడి సమర్ధత, సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ మనీషా నెహ్రా ఉద్బోధించారు.
జాతీయ బాలికల దినోత్సవంను పురస్కరించుకొని హన్మకొండ లస్కర్ బజార్ లోని బాలికల ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐపిఎస్ ఆఫీసర్ మనీషా నెహ్ర మాట్లాడుతూ… బాలికలు దేశ అభివృద్ధిలో సమాన భాగస్వాములని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, సామాజిక అభివృద్ధిలో బాలికలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయ పడ్డారు.

బాల్య వివాహాల నివారణ, బాలికలపై జరుగుతున్న వేధింపులు, బాలికల రక్షణ కోసమై ఉన్న చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ మనీషా నెహ్రా మార్గ నిర్ధేశ్యం చేశారు. బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని హన్మకొండ ఇన్స్ పెక్టర్ మచ్చ శివకుమార్ సూచించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, వేధింపులపై ఫిర్యాదులు చేస్తే తగిన న్యాయం చేకూరుస్తామని హామీ ఇచ్చారు.

బాలికలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కీలక పాత్ర పోషించాలన్నారు. బాలికలు ఉజ్వల భవిష్యత్తు కోసమై కనే కలలను సాకారం చేసుకోవాలని హన్మకొండ ఇన్స్ పెక్టర్ మచ్చ శివకుమార్ సూచించారు. విద్యార్థినీలకు కూరపాటి హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ రాధిక, స్కూల్ ప్రిన్సిపల్ ఉమలు కలిసి పండ్లు పంచారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సతీష్, స్కూల్ టీచర్స్, స్టూడెంట్స్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది పాల్గొన్నారు.


CLICK HERE TO READ MORE : Recovery | చోరీకి గురైన 150 మొబైల్ ఫోన్లను రికవరీ…
