Rally | ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదు

Rally | ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదు
- ప్రజల భద్రత కోసమే రూల్స్
- వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద
- ఓరుగల్లులో రోడ్డు భద్రతపై ర్యాలీ నిర్వహించిన ఆర్టీఏ అధికారులు
Rally | వరంగల్ సిటీబ్యూరో, ఆంధ్రప్రభ : మానవ తప్పిదాలతో పాటు రోడ్డు భద్రత నియమావాళి ఉల్లంఘనల వల్లే రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఎత్తి చూపారు. నిర్లక్ష్యం, మితిమీరిన విశ్వాసాల వల్లే రోడ్డు ఆక్సిడెంట్స్ లో ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తించి, ప్రతి ఒక్కరు బాధ్యతగా డ్రైవ్ చేయాలని సూచించారు.

సురక్షిత ప్రయాణం సాగించడానికే రూల్స్ రూపొందించి అమలు పరుస్తున్నారని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పేర్కొన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్ నుండి వరంగల్ చౌరస్తా వరకు రవాణా శాఖ అధికారులు నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు.
ఈ ర్యాలీ లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, వరంగల్ ఆర్ టీఓ శోభన్ బాబు, మహబూబాబాద్ ఆర్ టీఓ జైపాల్ రెడ్డి, రవాణాశాఖ అధికారులు, ఇంతేజార్ గంజ్ ఇన్స్ పెక్టర్ ఎం ఏ షూఖుర్, వరంగల్ ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ కోడూరు సుజాత, ఇతర పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
