vasanta Panchami | పాఠశాలలో వసంత పంచమి వేడుకలు…

vasanta Panchami | టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని శాంతి నికేతన్ పబ్లిక్ స్కూల్లో ఈ రోజు ఘనంగా వసంత పంచమి వేడుకలు జరిగాయి. కరెస్పాండెంట్ మియాపురం హరీష్ కుమార్, చైతన్య ఆధ్వర్యంలో పాఠశాలల్లో పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలోవారు పాల్గొని పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించారు. అలాగే పాఠశాలలో సరస్వతి పూజ చేసి, విద్యార్థులకు కరస్పాం డెంట్ , పండితుచేత మంత్రోత్సవాల మధ్య అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
