Zaynur | సందీరికి రామ్ రామ్..

Zaynur | సందీరికి రామ్ రామ్..
- అలరించిన కలెక్టర్ గోండి భాష ప్రసంగం
Zaynur | జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం మాశి బాబా జిల్లా నూతన కలెక్టర్ హరిత బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఈ రోజు మండలంలోని జంగాంలో జరిగిన ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమావేశంలో పాల్గొని ముందుగా మాట్లాడుతూ… సందీరికి రామ్ రామ్ అంటూ గోండి భాషలో సభ్యతగా కృతజ్ఞతలు తెలుపుతూ మాట్లాడడంతో సభలో అలరింపచేశారు.
అనంతరం కలెక్టర్ తెలుగు భాషలో మాట్లాడుతూ… తాను నూతన కలెక్టర్ గా వచ్చానని ఈ ప్రాంతం బాగోద్వేగంతో ఉందని ఆదివాసుల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమావేశంలో మొదటిసారిగా పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా సమస్యల పరిష్కారానికి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని ఆసిఫాబాద్ నూతన కలెక్టర్ హరిత పేర్కొన్నారు. నూతన కలెక్టర్ మొదటిసారిగా గోండి భాషలో మాట్లాడడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
