Bikkanoor | నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు..

Bikkanoor | బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని మల్లారెడ్డి గ్రామంలో నీటి ఎద్దడి నివారణతో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ కోడూరి సాయ గౌడ్ చెప్పారు. ఈ రోజు గ్రామంలో పలు బోర్లను ప్రెస్సింగ్ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పట్లూరి చైతన్య కొండల్ రెడ్డి, బిక్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ టెంట్ హౌస్ స్వామి వార్డు సభ్యులు శ్రీనివాస్, మాధవరెడ్డి, నటలింగం, కాంతి నరసింహులు, రాధ నర్సింలు, పెద్దోళ్ల అనిల్, నాలికే రాకేష్ ,మంద ఎల్లంరాజు, సెక్రటరీ లక్ష్మీ, గ్రామ జీపీఓ అశోక్ గ్రామస్తులు పాల్గొన్నారు.
