TG | ప్రజా బాటలో విద్యుత్ సమస్యల గుర్తింపు

TG | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని ముషిపట్ల గ్రామంలో ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ సమస్యలను గుర్తించారు. ట్రాన్స్కో ఏ డి ఈ బాలు నాయక్, ఏ ఈ ప్రభాకర్ రెడ్డిలు తమ సిబ్బందితో కలిసి గ్రామంలో పర్యటించి సమస్యలను గుర్తించారు. గ్రామంలో 8 కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు, 2 లూజ్ లైన్ పోల్స్ , 2 శిథిలావస్థకు చేరిన స్థంబాలను గుర్తించి వారం రోజుల్లో సమస్యను పరిష్కరించి, నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు.
