వెలగపూడి – అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు నాయుడు నేడు మార్కాపురంలో పర్యటించనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే సభ, వేడుకల్లో సీఎం పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మార్కాపురానికి సీఎం బయలుదేరారు.. ముందుగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో మాట్లాడతారు. అనంతరం సభాప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శన, లబ్ధిదారులకు పథకాల పంపిణీని సీఎం చేస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు ఉమెన్స్ డే సందర్భంగా వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి భేటీ కానున్నారు. కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా మహిళలతో సమావేశం కానున్నారు. డ్వాక్రా మహిళలకు సంబంధించి కొత్త పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. మహిళా దినోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం కార్యకర్తలతో భేటి అవుతారు. ఆ తర్వాత జిల్లా అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఇక సాయంత్రం 4.30 గంటలకి మార్కాపురం నుంచి బయలుదేరి ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు తిరిగి వెళ్లనున్నారు.