TG | ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలి

TG | ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలి

  • జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్

TG | కుంటాల, ఆంధ్రప్రభ : జిల్లాలోని రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ అన్నారు. కుంటాల మండలంలోని కల్లూరులో ఆయన ఈ రోజు గ్రామపంచాయతీలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ కేంద్రాన్నిపరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాలోని ప్రతి ఒక్క రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని ప్రభుత్వ పథకాలు రైతులకు సులభంగా చేరాలంటే ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలన్నారు. ఒకే ఐడితో లబ్ధి నేరుగా బ్యాంక్ ఖాతాలోకి చేరుతుందని ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడితో స్పష్టమైన గుర్తింపు సంఖ్య రావడం వల్ల మోసాలు తగ్గుతాయన్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు, ఆధార్ లింకు అయి ఉన్న మొబైల్ నెంబర్ తీసుకొని మండల ఏఈఓల ద్వారా గాని, మీసేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవచ్చన్నారు. రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం మూలంగా ఎలాంటి మోసాలు ఉండవని రైతులకు వివరంగా తెలియజేశారు. ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ప్రభుత్వ పథకాలు వర్తించబోవని ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన తెలిపారు.

పంటల సాగు పద్ధతులపై రైతులకు అవగాహన

పంటల సాగు పద్ధతులపై రైతులకు వివరించారు. మొక్కజొన్న, మిరప పంటలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధిక మోతాదులోని మూడు ఎకరాలకు ఒక బస్తా యూరియా వాడాలని తెలియజేశారు. అదేవిధంగా మొక్కజొన్న, మిరప పంట సాగు వివరాలను పలు రైతులు అడిగి తెలుసుకోగా మిరప పంటకు పిచికారి విధానాలు చేస్తే దిగుబడి లభిస్తుందని వాతావరణం అనుకూలించకపోవడం మూలంగా మిరప పంటకు బూడిద ఆకారంలో వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేశారు. జొన్న పంట పై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పొందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోస్థానిక సర్పంచ్ పెంట వార్ దశరథ్, ఉప సర్పంచ్ నారాయణ పటేల్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి గణేష్, మాజీ సర్పంచ్ బి రమణ గౌడ్, ఆశ గౌడ్ తో పాటు రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply