Hyderabad | జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత…

Hyderabad | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నగరంలోని జూబ్లీహిల్స్ పీఎస్ ఎదుట ఇవాళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ అధికారులు మూడు గంటలకు పైగా విచారిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా అక్కడికి దూసుకెళ్లారు. దీంతో పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. స్టేషన్ ఎదుట పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొడుతున్నారు.

Leave a Reply