బహదూర్‌పురా ప్రాంతంలో ఈరోజు (గురువారం) రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లోకల్ లారీ మెకానిక్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసి పడటంతో.. పక్కనే ఉన్న మూడు అంతస్తుల భవనానికి వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.