Distribution | ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

Distribution | ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

  • లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ
  • ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి

Distribution | ఊర్కొండ, ఆంధ్రప్రభ : ఊర్కొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను మంగళవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply