ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసిన ఇంగ్లండ్ ప్లేయర్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్సె గాయం కారణంగా ఐపీఎల్ సీజన్ కు దూరమయ్యాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ భాగంగా.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కార్సే కాలికి గాయం అయ్యింది. దీంతో అతడు మిగిలిన టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఇంగ్లాండ్ రెహాన్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకుంది.
ఇక గతేడాది నవంబర్ లో జరిగిన మెగా వేలంలో సన్‌రైజర్స్ యాజమాన్యం కార్సేను రూ.1 కోటికి కొనుగోలు చేసింది. అయితే, ఐపీఎల్ ప్రారంభ సమయానికి కూడా కార్సే కోలుకునే పరిస్థితి కనపడకపోవడంతో.. సన్‌రైజర్స్ తమ జట్టులోకి కొత్త ఆటగాడిని ఆహ్వానించింది.
కార్సే స్థానంలో సౌతాఫ్రికా ప్లేయర్ ఆల్ రౌండర్ వియాన్ ముల్డర్‌ను తీసుకున్నట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.