Borabanda | భార్యను రోకలిబండతో కొట్టి….

Borabanda | భార్యను రోకలిబండతో కొట్టి….
Borabanda | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భార్యపై ఓ భర్త అనుమానం పెంచుకుని ఆగ్రహంతో రోకలి బండతో దాడి చేశాడు. దీంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్ లోని బోరబండ అహ్మద్‌నగర్ డివిజన్లోని రాజీవ్ నగర్లో ఇవాళ తెల్లవారుజామున చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. భార్య సరస్వతి(35)పై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య తరచూ ఘర్షణ జరిగేది. అలాగే ఇవాళ మరోసారి ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన భర్త.. భార్య తలపై రొకలి బండతో బలంగా కొట్టాడు. తలకు తీవ్ర గాయం కావడంతో.. ఆమె ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న బోరబండ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
