A tragic incident | ఆస్తి కోసం దారుణం..!

A tragic incident | ఆస్తి కోసం దారుణం..!

  • సొంత తమ్ముడిని హత్యచేసిన అన్న
  • బావమరిదితో కలిసి ఘాతుకం
  • తాండూరు పట్టణంలో ఘటన
  • పరిశీలించిన డీఎస్పీ నర్సింగ్ యాదయ్య

A tragic incident | తాండూరు, ఆంధ్రప్రభ : ఆస్తి కోసం అన్న సొంత తమ్ముడిని హత్య చేశాడు. బావ మరిదితో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో ఇవాళ‌ చోటు చేసుకుంది. తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. తాండూరు పట్టణం మాణిక్ నగర్ మోసిస్, రెహమాన్ (27) అన్నదమ్ములు. గత కొన్ని రోజులుగా అన్నదమ్ముల మధ్య‌ ఇంటి విషయంలో ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి.

ఈనేపథ్యంలో ఇవాళ‌ అన్న మోసిస్ తన బావ మరిది గౌస్ తో కలిసి రెహమాన్ పై పదునైన కత్తితో దాడి చేశాడు. మెడ, నడుము భాగంలో దాడి చేయడంతో రెహమాన్ కు తీవ్ర రక్తగాయాలయ్యాయి. రక్తపు మడుగులోనే రెహమాన్ మృతిచెందాడు. తమ్ముడిని హత్య చేసిన మోసిస్, అతని బావమరిది గౌస్ లు అక్కడి నుంచి పరారయ్యారు. డయల్ 100 ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, పట్టణ ఎస్ఐ అంబార్యలు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. పరిసరాలను పరిశీలించి పలు ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మార్చురికి తరలించారు. మృతుని కుటుంభీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు.

Leave a Reply