Tuggali | మహానేత ఎన్టీఆర్‌కు ఘ‌న నివాళి

Tuggali | తుగ్గలి, ఆంధ్రప్రభ : తెలుగు రాష్ట్రాలలోనే ప్రజలలో రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన మహానేత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే కెఈ శ్యామ్ కుమార్ అన్నారు. ఆదివారం రాతన గ్రామంలో ఎన్టీఆర్ 30 వ వర్ధంతి కార్యక్రమం మాజీ సర్పంచ్, టీడీపీ రైతు విభాగపు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. మనోహర్ చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. గ్రంథాలయ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకట రాముడు, సీనియర్ టిడిపి నాయకులు తిమ్మయ్య చౌదరి, రాతన గోవింద్ రెడ్డి, కృష్ణమూర్తి చౌదరిలతో కలిసి ఎమ్మెల్యే కెఈ శ్యామ్ కుమార్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.

Tuggali

ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ తిరుపాల్ నాయుడు, ఉపాధ్యక్షులు కొట్టాల వెంకట్రామ చౌదరి, స్థానిక టిడిపి నాయకులు రాతన శ్రీనివాసులు, దేవేంద్ర, రాతన కొత్తూరు కోటేశ్వరరావు, సుంకన్న, వన్నూరప్ప, నగేష్, మండల నాయకులు చంద్రశేఖర్ యాదవ్, శివరాముడు చౌదరి, చెన్నంపల్లి సంజీవ చౌదరి, సోమశేఖర్ గౌడ్, తుగ్గలి వల్లే వెంకటేష్, ఎడవలి తిమ్మప్ప, జొన్నగిరి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply